చిరంజీవి కొత్త కారు ఇదే, నెంబర్ కోసం ఖర్చెంతంటే?: ఆర్టీఏ ఆఫీసులో ఇలా
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవల ఆయన టయోటా వెల్ఫైర్ కారు కొనుగోలు చేశారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశారు.
కాగా, చిరంజీవి కొన్న కొత్త కారు ధర రూ. కోటికిపైగా ఉంటుందని తెలిసింది.
ఇప్పటికే చిరంజీవి గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈసారి మాత్రం టయోటా కంపెనీ నుంచి కొత్తగా విడుదలైన కారును కొనుగోలు చేశారు. దీని మార్కెట్ ధర రూ. కోటి 30 లక్షలుగా ఉంది.

ఇతర అన్ని ఫీచర్స్, ఇంటీరియర్ కలుపుకుంటే మరో 20 లక్షలు కలుపుకుంటే.. ఈ కారు ధర కోటిన్నర అయ్యే అవకాశం ఉంది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం చిరంజీవి ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 1111 నెంబర్ కోసం రూ. 4.70 లక్షలు చిరంజీవి చెల్లించడం గమనార్హం. కాగా, పలువురు ఉద్యోగులు, అభిమానులు చిరంజీవితో ఈ సందర్భంగా ఫొటోలు దిగారు.
కాగా, ఎక్కువగా సినీ ప్రముఖులు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనే తమ కొత్త కార్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. గతంలో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఇక్కడే తమ కొత్త కార్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.












Click it and Unblock the Notifications