Christmas : క్రిస్మస్ సంబరాలు.. హార్ట్ ఎటాక్‌తో 13ఏళ్ల బాలుని మృతి..
క్రిస్మస్ సంబరాల్లో విషాదం వెలుగుచూసింది. హార్ట్ ఎటాక్‌తో ఓ పదమూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదం రాజన్న సిరిసిల్ల జల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... నిజామాబాద్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకి ఇద్దరు కొడుకులు.
జశ్వంత్, సుశాంత్. దంపతులిద్దరూ కూలి పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. వీరి పెద్ద కొడుకు జశ్వంత్ కోనరావుపేట గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదవుతున్నాడు. చిన్నకొడుకు సుశాంత్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

పండగ వేళ.. కుటుంబంలో విషాదం: క్రిస్మస్ పండుగ సందర్భంగా సుశాంత వసతి గృహం నుంచి ఇంటికి వచ్చాడు. క్రిస్మస్ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఇంట్లో అందరూ ఉన్న సమయంలో ఛాతిలో నొప్పి అనుకుని కింద పడిపోయాడు. అక్కడే వున్న ఇంట్లోని సభ్యులకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఊపిరి ఆడకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు సుశాంత్ ను హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు వైద్యం చేస్తుండగానే సుశాంత్ కన్నుమూశాడని వైద్యులు నిర్ధారించారు. దీంట్లో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతచిన్న వయస్సులో సుశాంత్ కు గుండెపోటు రావడం ఏంటని కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.
జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లే కారణం: ప్రస్తుత సమాజంలో గుండెపోటుకు గురై చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ హార్ట్ ఎటాక్‌లకు గురవుతున్నారు. వీటికి ముఖ్యంగా మానసిక ఒత్తిడే కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నామని వైద్యులు వెల్లడించారు.
తీవ్రమైన ఒత్తిడులకు లోనవ్వడం వల్లకూడా ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత వ్యాయమంతో పాటు సమయానికి భోజనం కూడా ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయం పూట అల్పాహారం కూడా మానేస్తున్నారు. కాబట్టి సమయానికి భోజనం ఎంతో అవసరం.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications