క్రిస్మస్ పండగకు మూడు రోజుల సెలవులు
క్రిస్మస్ పండగకు తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. దీంతో తెలంగాణలో అన్ని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే జనరల్ హాలీడే కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు స్కూళ్లకు హాలీడేస్ ఉండనున్నాయి. కాగా, 2023లో క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 27 వరకు సెలవులు ఇచ్చింది.

కాగా, ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండగను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రిస్టియన్ సోదరులు వేడుకగా జరుపుకుంటారు. క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడటం, కేక్‌లు పంచుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంప్రదాయాలు అనుసరిస్తారు.
క్రిస్మస్ గ్రీటింగ్స్ పేరిట మోసాలు: అలర్ట్
క్రిస్మస్ పండగను ఆసరాగా చూసుకునే కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు.. మెర్రీ క్రిస్మస్, మీరు మా ప్రియమైన కస్టమర్.. ఈ గిఫ్ట్ మీ కోసమే..' అంటూ అపరిచిత వ్యక్తుల నుంచి మీకు సందేశాలతో కూడిన శుభాకాంక్షలు వెల్లువెత్తితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఏదో బహుమతి వస్తుందంటూ ఆశతో దుండగులు పంపిన లింక్స్‌పై క్లిక్ చేస్తే.. ఫోన్లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి, వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు ఇదో రకం కొత్త మోసానికి పాల్పడుతున్నారని అన్నారు. తెలియని వ్యక్తుల నుంచి క్రిస్మస్ విషెస్ అంటూ వచ్చే సందేశాలను క్లిక్ చేయవద్దని సూచించారు. అప్రమత్తంగా లేకుంటే.. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications