Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రియాల్టర్ బాలకృష్ణ కిడ్నాప్ కేసు: సీఐ చంద్రబాబు సస్పెండ్

హైదరాబాద్: రియాల్టర్ బాలకృష్ణ కిడ్నాప్ కేసులో నేరేడ్‌మెట్ సీఐ చంద్రబాబు సస్పెండ్ అయ్యారు. ఈ కిడ్నాప్ కేసులో సీఐ చంద్రబాబు నిందితులతో కుమ్మక్కయినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సస్పెండ్ చేశారు.

సీఐను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీవీ ఆనంద్ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. భూతగాదాల్లో కిడ్నాప్ చేసిన కేసు విషయంలో సీఐ స్వయంగా జోక్యం చేసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

కేసుపై మొత్తం విషయం తెలిసినా నిందితుడి గురించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకుండా ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా విషయం మొత్తం వెలుగులోకి రావడంతో సీఐ హస్తం బయటపడింది. దీంతో సీఐను సస్పెండ్ చేస్తూ శాఖపరమైన దర్యాప్తునకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.

CI Chandrababu suspends in Hyderabad

భవనం పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

నిజామాబాదులో కళాశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అలేఖ్య కాలేజీ భవనంపై నుంచి దూకింది. తీవ్రగాయాలపాలైన విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లెక్చరర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

చైన్ స్నాచర్‌కు ఏడేళ్ల జైలు

గత కొన్నాళ్లుగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అక్రమ్ అనే నిందితుడుకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇతని పైన పంజాగుట్టతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులుగా అతను చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+