సినీ నటుడి కిడ్నాప్: నిందితుల్లో న్యూస్ చానె డిజిఎం, సిఐడి హోంగార్డ్
హైదరాబాద్: డబ్బు కోసం ఓ సినీ నటుడిని కిడ్నాప్ చేసిన ఐదుగురిని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తన్నారు. నిందితుల్లో సీఐడి హోంగార్డు రాజు, ఓ న్యూస్ చానెల్ డీజీఎం జలీల్‌తోపాటు మరో ముగ్గురున్నారు. ఇందులో చానెల్ నిర్వాహకుడి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి.
అతడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణానగర్‌కు చెందిన సినీనటుడి ఇంటికి మూడు రోజుల క్రితం పోలీసుల మని కొంతమంది వెళ్లారు. వ్యభిచారం చేయిస్తున్నావంటూ బెదిరించి పదివేల రూపాయలు తీసుకున్నారు. మరికొంత డబ్బు కావాలని అతడిని కిడ్నాప్ చేసి నగరమంతా తిప్పారు.

సినీ నటుడు చింతల్‌లో తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తులో సీఐడి హోంగార్డు రాజుతోపాటు జలీల్ ముఖ్య పాత్రధారులని తేలింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - సినీ నటుడు వ్యభిచార గృహం నిర్వహించినప్పుడు ఇద్దరు సెక్స్‌వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ కలిసి వ్యభిచారం చేశారు.
ఆ తరువాత విభేదాలు వచ్చి విడిపోయారు. సెక్స్‌వర్కర్‌లు ినీ నటుడి గురించి రాజు, జలీల్‌కు చెప్పారు. వీరంతా పథకం వేశారు. సెక్స్‌వర్కర్‌లు శ్రీనివాస్‌రావుకు ఫోన్ చేసి పాత విషయాలు గుర్తుపెట్టుకోవద్దని, తమకు డబ్బు అవసరముందని ఏం చేయమంటే అది చేస్తామని చెప్పారు. అతడు వారిని ఇంటికి రమ్మన్నాడు.
జలీల్, రాజు తమ మనుషులను విటులుగా పంపించారు. కొద్ది సేపటికి పోలీసులు, మీడియా అంటూ ఇంట్లోకి వెళ్లి సినీ నటుడిని డబ్బు అడిగి కిడ్నాప్ చేశారు. అయితే, వారు చివరకు పోలీసులకు దొరికిపోయారు.












Click it and Unblock the Notifications