ఇంటికెళ్లి మరీ!.. జూ.ఆర్టిస్టుపై సినీ కో-ఆర్డినేటర్ రేప్, అవకాశాల పేరుతో నమ్మించి!
Recommended Video

హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డ సినీ-కోఆర్డినేటర్ శ్రీశాంత్ రెడ్డి వ్యవహారంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీశాంత్ రెడ్డి.. అదే అదునుగా భావించి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శ్రీశాంత్ రెడ్డిని కోరగా అందుకు తిరస్కరించాడు.

ఎవరీ శ్రీశాంత్ రెడ్డి?:
ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం మానేపల్లికి చెందిన శ్రీశాంత్‌రెడ్డి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇందిరానగర్‌లో నివాసం ఉంటూ సినీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో గతేడాది అక్టోబరులో ఓ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతనికి పరిచయమైంది.

అవకాశాలు ఇప్పిస్తానని:
సదరు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని శ్రీశాంత్ రెడ్డి నమ్మించాడు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్ 10న బోరబండలోని ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తర్వాత ఆమెకు కూల్ డ్రింక్ ఇవ్వడంతో.. కాసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

ఇంటి వద్దే అత్యాచారం:
ఆ మహిళ స్పృహ కోల్పోవడంతో శ్రీశాంత్ రెడ్డి ఆమెపై అత్యాచారం జరిపాడు. అంతేకాదు, ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు అభరణాలు, రూ.5 లక్షలు చోరీ చేసి పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని కలిసినప్పుడు దీనిపై ఆమె నిలదీసింది. దీంతో పెళ్లికి కట్నం కింద తీసుకున్నాను అనుకో అంటూ బుకాయించాడు. కొద్దిరోజులకు పెళ్లి చేసుకోవాలని కోరగా.. అందుకు తిరస్కరించాడు.

గురువారం హైడ్రామా:
శ్రీశాంత్ రెడ్డి తనను మోసం చేయడంతో అతనిపై కేసు పెట్టేందుకు బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమె వెంట సినీ ఆర్టిస్టులు శ్రీరెడ్డి, సోనారాథోడ్, రాగసృతి, సునితారెడ్డిలు కూడా వచ్చారు.
అదే సమయంలో శ్రీశాంత్ రెడ్డి కూడా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు అక్కడికి వచ్చాడు. శ్రీశాంత్ రెడ్డిపై ఆగ్రహంతో బాధితురాలు అతనిపై చెప్పుతో దాడి చేయడం.. మిగతా ఆర్టిస్టులు కూడా అతనిపై దాడికి యత్నించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా!










Click it and Unblock the Notifications