ఎన్నికల ప్రచారంలోకి బాలకృష్ణ: హుజూర్ నగర్ లో సందడి: బావ మాట కోసం..!
తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సినీ హీరో ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి దిగుతున్నారు. టీడీపీ నుండి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. స్థానిక నేతల ఒత్తిడి మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ అభ్యర్ధిని బరిలోకి దించాలని నిర్ణయించారు. అయితే.. టీడీపీ.. బీజేపీ కి మాత్రం ఎవరి మద్దతు లభించలేదు. టీఆర్ యస్ కు ఇప్పటికే సీపీఐ తో పాటుగా వైసీపీ సైతం మద్దతు ప్రకటించాయి.
ఇక, కాంగ్రెస్ కు కోదండరాం టీం మద్దతుగా నిలిచింది. సీపీఎం పోటీలో లేదు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కావటంతో ఆ పార్టీ తిరిగి అక్కడ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నుండి ఇంకా సమాధానం రాలేదు. ఇదే సమయంలో ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్దికి మద్దతుగా అక్కడా సినీ హీరో నందమూరి బాలకృష్ణ ను రంగంలోకి దించటం ద్వారా పార్టీ కేడర్ లో కొత్త జోష్ వస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీంతో..ఆయన నందమూరి బాలకృష్ణతో మాట్లాడారు. హుజూర్ నగరలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కోరారు.

వచ్చే వారంలో బాలయ్య ప్రచారం..
పార్టీ అధినేత చంద్రబాబు సూచన మేరకు నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీలోగా హుజూర్ నగర్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నిక పైన పార్టీ నేతలు చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సమయంలో తాను నందమూరి బాలకృష్ణతో మాట్లాడానని..ఆయన ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించారని చంద్రబాబు చెప్పారు. దీనికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. హుజూర్ నగర్ లో టీడీపీ సత్తా ఏంటో చూపించాలనే కసితో స్థానిక నేతలు ఉన్నారని నాయకులు చంద్రబాబుకు వివరించారు.
నందమూరి బాలకృష్ణ ప్రచార సమయంలో నిజయోజకవర్గం పరిధిలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏర్పాటుచేస్తున్నారు. అయితే, అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ యస్ అక్కడ పెద్ద ఎత్తున మంత్రులు..నేతలనున మొహరించింది. మండలాలు..గ్రామాలు..సామాజిక వర్గాల వారీగా బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తం సైతం తనకు అక్కడ ఉన్న పట్టు నిలుపుకొనేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ఇప్పుడు టీడీపీ నుండి బాలకృష్ణ ప్రచారానికి రావటం ఖరారు కావటంతో..కాంగ్రెస్ నుండి విజయశాంతిని ప్రచారానికి దించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే, అందుకు ఆమె సిద్దంగా లేరని తెలుస్తోంది. అయినా ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక, పవన్ కళ్యాన్ తన మద్దతు గురించి ఎటువంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు












Click it and Unblock the Notifications