పెద్ద నగదు రద్దు కష్టాలు...బ్యాంకుకు సినిమా స్టార్లు

హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రతి ఒక్కరికి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. రాజు, పేద, పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అనేక మంది కరెన్సీ లేక కష్టపడుతున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా సామాన్యులే కాదు సినిమా స్టార్లు కూడ ఇబ్బందులు పడుతున్నారు.

పెద్ద నగదు ను రద్దు చేయడం వల్ల చిల్లర నగదు కోసం ప్రతి రోజూ బ్యాంకుల వద్ద, ఎటిఎం ల వద్ద జనం బారులు తీరుతున్నారు. అయితే సినిమా స్టార్లకు కూడ కరెన్సీ కష్టాలు తప్పలేదు.

cinema star pawan kalyan exchange an old currency in bank

రద్దు చేసిన నగదు స్థానంలో కొత్త కరెన్సీ తీసుకొనేందుకు బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు.బుదవారం నాడు సినిమా స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ నగరంలోని ఓ బ్యాంకులో నగదును మార్చుకొన్నారు.

నగరంలోని ఓ బ్యాంకుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఖాతాలోని నగదును మార్చుకొన్నారు. పవన్ రాకతో నగదు మార్పిడి కోసం బ్యాంకు వచ్చిన ఖాతాదారులు పవన్ ను చూసేందుకు ఎగబడ్డారు.కొత్త కరెన్సీని తీసుకొని పవన్ బ్యాంకు నుండి వెళ్ళిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+