హైదరాబాదీలకు బిగ్ అలర్ట్ , ఈ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు..!!
న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు, పలు ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకలకోసం ఏర్పాట్లు చేశారు. అయితే, న్యూఇయర్ వేళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగ నున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ మూసివేయాలని నిర్ణయించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవనసరాన్ని బట్టి బంద్ చేస్తామని ఇంచార్జి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండుగంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లస్‌రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

కాగా, ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పైకి అనుమతించనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటలనుంచే కొనసాగుతాయని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్‌లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందని.. మహిళల భద్రతకు ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈవెంట్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. 31వ తేదీ అర్ధరాత్రి 1గంట వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications