హైదరాబాదీలకు శుభవార్త: సిటీలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ (ఫోటోలు)

హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్‌ మహానగరం వేడుకలకు ప్రధాన వేదికగా మారిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక సమావేశాలు, ఉత్సవాలకు హైదరాబాద్‌ను ఉత్తమ వేదికగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆ క్రమంలోనే ప్రైవేట్ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో తొలిసారి గతంలో ఎన్నడూ చూడని విధంగా స్కైఫెస్ట్‌-2015ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన రైడ్‌తో ఆకాశాన్ని విహరించే అనుభవాన్ని సొంతం చేయనుంది. బంజారాహిల్స్‌ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ బాధితుల కోసం నిర్వహిస్తున్న స్పర్శ్‌ హోస్పైస్‌ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్‌ 23నుంచి 27వరకు జరిగే ఈ వేడుకలను రోటరీ క్లబ్‌ నిర్వహిస్తోంది. బుధవారం తాజ్‌ డెక్కన హోటల్‌లో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి కేటీఆర్‌, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు సేవలందించే స్పర్శ్ హాస్పైస్ అనే సంస్థకు నిధిని ఏర్పాటు చేసేందుకు ఐదు రోజులపాటు భారీ ఈవెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులు సైతం సరిగా కూడా చూసుకోని క్యాన్సర్‌ బాధితులను చేరదీసి వారికి సేవలందిస్తున్న తీరు అభినందనీయమన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

ఒక మంచి ఆశయం కోసం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. నగరవాసులందరికీ వినోదం, షాపింగ్‌, ఆహారం వంటి సేవలను అందిస్తూ నిర్వహిస్తున్న ఇలాంటి వేడుకలను ఆదరించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా హైదరాబాద్‌ ప్రతిష్టను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశ ముందని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

వినోదం అందించేందుకు శంకర్ మహదేవన్, దేవీశ్రీప్రసాద్, సోనూనిగమ్ వంటి ప్రఖ్యాత గాయకులు, డీజేలు, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, షాపింగ్, మిడ్‌నైట్ మూవీ స్క్రీనింగ్, హాట్ ఎయిర్ బెలూన్ ఈవెంట్స్‌ను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలనుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

ఇలాంటి ఈవెంట్స్‌ను నిర్వహించడం ద్వారా హైదరాబాద్ సోషల్ క్యాపిటల్‌గా మారుతుందన్నారు. సోషల్ లైఫ్‌లో ప్రజలను భాగం చేసే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు, ఉన్నత ఉద్యోగులు, వ్యాపారుల ను ఆకర్షించవచ్చన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే కాకుండా సోషల్‌ క్యాపిటల్‌గా ప్రమోట్‌ చేయడం ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తోందన్నారు. ఐదు రోజుల పాటు జరిగే వేడుకల్లో తెలంగాణ డే పేరుతో నిర్వ హించే ఒక రోజును నిర్వహించడం అభినందనీయమన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

రోటరీ క్లబ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రామడుగు జగదీష్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ బాధితుల కోసం తాము నిర్వహిస్తున్న స్పర్శ్‌ హోస్పైస్‌ 15 బెడ్లతో కూడిన ఆస్పత్రి. దీనికి 50 బెడ్ల వరకూ పెంచాలనే ఉద్దేశంతో నిధుల సేకరణ కోసం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

గచ్చిబౌలిలో డిసెంబర్ 23-27 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్

వేడుకలో హాట్‌ ఎయిర్‌ బెలూన ద్వారా 2500 మంది ఆకాశంలో విహరిస్తూ ఆద్భుతమైన అనుభూతిని పొందవచ్చన్నారు. నగరంలోని హెరిటేజ్‌ ప్రాంతాలను హాట్‌ ఎయిర్‌ బెలూనలో వెళ్లి చూసి వచ్చేలా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+