వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన విశ్రాంతి లేకనో కాదు. కడుపునిండా తిండి, తీసుకోవడానికి విశ్రాంతి ఎక్కువైన నగర యువత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. గత 36 రోజులుగా మానవ సంబంధాలకు దూరంగా ఉంటున్న యువత ప్రస్తుతం సహనం కోల్పోతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో తీసుకున్న విశ్రాంతి చాలు, ఇళ్లలో ఒంటరిగా ఉండలేకపోతున్నాం మహాప్రభో అనే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మే 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రకటన పట్ల యువత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

తీసుకున్న విశ్రాంతి చాలు.. ఇక విముక్తి కలిగించండి బాబాయ్ అంటున్న యువత..

తీసుకున్న విశ్రాంతి చాలు.. ఇక విముక్తి కలిగించండి బాబాయ్ అంటున్న యువత..

నగరంలోని యువతీయువకులకు చిరాకుతో చిర్రెత్తుకొచ్చే పరిస్థితులు నెలకొన్నట్టు చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి విషకాటు నుండి తప్పించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ఆంక్షలు 36వ రోజుకు చేరుకున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఈ 36రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు. చిన్నా, పెద్దా, ముసలి ముతక తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అందుబాటులో ఉన్న షాప్ లో దొనికిన సరుకులు కొనుక్కుని సాదా జీవితాన్ని అనుభవించారు. ఇదే క్రమంలో నగర యువతీ యుకుల పరిస్థితి మాత్రం ఎంతో విచిత్రంగా మారినట్టు తెలుస్తోంది.

కాళ్లూ చేతులూ కట్టేసిన పరిస్థితి.. మోదీ లాక్ డౌన్ ప్రకటన పట్ల జనాల్లో ఉత్కంఠ..

కాళ్లూ చేతులూ కట్టేసిన పరిస్థితి.. మోదీ లాక్ డౌన్ ప్రకటన పట్ల జనాల్లో ఉత్కంఠ..

పెగ్ వేద్దామంటే రెస్టారెంట్లు లేవు.. చిందేద్దామంటే పబ్బులు లేవు.. కలుద్దామంటే స్నేహితులు లేరు.. బయటకు వెళ్దామంటే రవాణా వ్యవస్థలేదు.. కాలక్షేపం కోసం మాల్స్, సినిమా హాల్స్ కూడా లేకపాయే. ఇక నగర యువతీయువకుల పరిస్ధితి ఎలా..? ఐనప్పటికి గత 36రోజులుగా కోరికలను చంపుకుని స్వీయ నియంత్రణకు అలవాటు పడి ఒంటరి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు నగర యువత. ఇప్పటివరకూ ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలను పాటించాంగాని ఇక ముందు ముందు పాటించడం కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. విశ్రాంతి తీసుకొనీ, తీసుకొనీ బోర్ కొడుతున్నట్టు, మే 3తర్వాతైనా బయటికి పంపేందుకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలకు యువత మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

స్వీయ నియంత్రణ పాటించాం.. ఇక తట్టుకోలేమంటున్న ప్రజానికం..

స్వీయ నియంత్రణ పాటించాం.. ఇక తట్టుకోలేమంటున్న ప్రజానికం..

ప్రస్తుతం భారత దేశం మొత్తం మీద ఇదే లాక్ డౌన్ కొనసాగింపు పైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత 36రోజుల సుదీర్ఘ లాక్ డౌన్ తో ప్రజలు బేజారెత్తిపోవడం ఒకటైతే చిరుద్యోగులు, సామాన్యులు, రోజూవారీ కూలీలు ఆర్ధికంగా చితికి పోయారు. కరోనాతో ఇబ్బంది పడ్డ గ్రామాల రైతులు సకాలంలో తమ పంటను అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డ ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మే 3వ తారీఖు తర్వాత అయినా తమకు విముక్తి దొరుకుతుందా ? లేదా? అన్న పెద్ద ప్రశ్న జనాన్ని వేధిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ పొడగింపు ఉంటుంది. కానీ అది హాట్ స్పాట్లు, రెడ్ జోన్లకే పరిమితం అవుతుంది అన్నారు. ఈ ప్రకటన పట్ల ప్రజలతో పాటు యువతలో కొంత ఊరట కనిపించినట్టు తెలుస్తోంది.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !
ఆర్థికంగా చితికిపోయిన అనేక రంగాలు.. ఉపశమనం ఇవ్వాలంటున్న యువత..

ఆర్థికంగా చితికిపోయిన అనేక రంగాలు.. ఉపశమనం ఇవ్వాలంటున్న యువత..

ఇదిలా ఉండగా ప్రజా రవాణా వ్యవస్థపై తారా స్థాయిలో సందేహాలు కొనసాగుతున్నాయి. మాల్స్ తో పాటు వినోదం పంచే సినిమా హాళ్లపై ఆంక్షలు కొనసాగనున్నాయి. సామూహికంగా షాపింగ్ లు చేసుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఇంతకుమించి లాక్ డౌన్ కొనసాగిస్తే కొత్త రకం ప్రమాదం పొంచిఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి లాక్ డౌన్ ను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించరనే చర్చ జరుగుతోంది. దేశంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, అవన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల, మిగతా ప్రాంతాలకు లాక్ డౌన్ నుంచి విముక్తి దొరుకుతందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ ఇదే అంశం పట్ల మే2వ తేదీన కేబినెట్ సమావేశం తర్వాత ఓ కీలక ప్రకటన చేనున్నారు. ఇదే ప్రకటన పట్ల యువత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
With the majority of cases reported in the country, all of which are limited to a few areas, there is hope that the rest of the country will be freed from lockdown. Prime Minister Modi will make a key statement on the same issue after the Cabinet meeting on May 2nd. Young people seem to be eagerly awaiting the same announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X