సోమేష్ కుమార్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..!!
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేసారు. సోమేశ్ ను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిమామకం పైన భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రంలో 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కొనే ప్లాన్ లో సోమేష్ కుమార్ పాత్రాధారి అంటూ ఆరోపించారు. ఈ నియామకం పైన చాలా అపోహలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ వీఆర్ఎస్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో, వెంటనే సోమేష్ కు తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ ఏపికి కేటాయించారు. క్యాట్ ను ఆశ్రయించిన సోమేష్ అక్కడ పొందిన ఆదేశాల మేరకు తెలంగాణలో కొనసాగారు. అనేక హోదాలు నిర్వహించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే, క్యాట్ ఆదేశాల పైన కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం వెంటనే సోమేష్ ను తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీలో రిపోర్టు చేసిన సోమేష్ ఆ తరువాత వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటే ఏపీ సీఎం జగన్ తో పాటుగా, డీఓపీటీ కూడా అందుకు ఆమోద ముద్ర వేసింది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సోమేష్ కు కీలక పదవి అప్పగించటం పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. భూ బకాసురులు భూములు ఆక్రమించుకొనేందుకు సోమేష్ సహకరించారని భట్టి ఆరోపించారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చే భూములను ధరణి పేరుతో లాక్కున్నారని విమర్శించారు. ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూమలను తీసుకున్నారని విమర్శించారు. ఓఆర్ఆర్ లీజు వెనుక సోమేష్ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. సోమేశ్ సలహాదారుగా ఉంటే మళ్లీ దోపిడీ మొదలు పెట్టినట్టేనని చెప్పుకొచ్చారు. వెంటనే సోమేశ్ సలహదారు పదవి రద్దు చేయాలని కోరారు. సోమేశ్ పై విచారణ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications