క్లబ్ యజమాని దారుణ హత్య: పక్కా ప్లాన్‌తో అన్నయ్య పనే..

హైదరాబాద్: హైదరాబాదు నగరంలో ఓ క్లబ్ యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంపాపేట్‌లో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత అన్నయ్యనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మలక్‌పేట ఏసిపి సుధాకర్ కథనం ప్రకారం - వినయ్‌నగర్ కాలనీ బిఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్‌లో నివసించే రత్తాపురం శ్రీనివాస్ అలియాస్ బాబు(50) చంపాపేట ప్రధాన రహదారిపై ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో గత తొమ్మిదేళ్లుగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పేకాట క్లబ్‌లు మూసివేయడంతో తిరిగి తెరిపించుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడు.

Club owner murdered in hyderabad

అదివారం సాయంత్రం ప్రధాన రహదారికి అనుకుని ఉన్న క్లబ్ ఆవరణలో అతను ముగ్గురు స్నేహితులతో కలిసి కూర్చుని మాట్లాడుతుండగా అతని సోదరుడు సుభాష్ మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చాడు. మాట్లాడేది ఉందని కొద్దిగా పక్కకు తీసుకువెళ్ళి గొడవ పడుతుండగా సుభాష్‌తో వచ్చిన అనుచరులు హఠాత్తుగా కత్తులతో బాబుపై దాడికి దిగారు.

విచక్షణా రహితంగా మెడ, ఛాతి, కడుపులో నాలుగు కత్తితో పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్రావమై బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాబుకి అతని సోదరుడు సుభాష్‌కి కుర్మగూడలోని కుటుంబ పరంగా వచ్చిన ఇంటి, స్థలం విషయమై కొంత కాలంగా గొడవ నడుస్తుంది. ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్ పేరుతో మొదట సైదాబాద్‌లో పేకాట క్లబ్‌ను సుభాష్ నిర్వహించేవాడు.

సోదరుడి నుండి మృతుడు లీజుకు తీసుకుని ఆ తరువాత తన సొంతం చేసుకున్నాడు. ఇవన్ని మనస్సులో పెట్టుకుని పక్కా ప్లాన్‌తోనే సుభాష్ తన సోదరున్ని హత్య చేసినట్లు తెలుస్తుంది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించి సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+