త్వరలో ఇంగ్లీష్ దిన పత్రిక ప్రారంభించనున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంగ్లీష్ దిన పత్రిక ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ మీడియా వ్యాపారంలో ఉన్న విషయం తెలిసిందే. నమస్తే తెలంగాణ దిన పత్రిక, టీ న్యూస్ ఛానళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సిద్ధించక ముందు తెలంగాణ సాధనలో భాగంగా ఆ ఛానల్, దినపత్రికలు పుట్టుకు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆంగ్ల దినపత్రికను ప్రారంభించాలనే యోచనలోను కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. దానికి తెలంగాణ టుడే అని పేరు పెట్టనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ టుడే పత్రిక పైన మరో రెండు మూడు నెలల్లో తీసుకు వచ్చినా రావొచ్చని అంటున్నారు. ఇప్పటికే నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానళ్లు ఉన్నందున.. పలు ఎడిషన్స్ ప్రారంభించేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications