తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారీకీ పీఆర్సీ..!!

అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులను సైతం విడుదల చేయాలని సూచించారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలో జరిగే కేబినెట్ లో మరిన్ని నిర్ణయాలు ప్రకటించనున్నారు.

ఎన్నికల వేళ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి ముందే మరిన్ని ప్రజాకర్షక నిర్ణయాల దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. వచ్చే వారం జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌తో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.

CM KCR Announces PRC For Anganwadi Employees along with Govt Employees

అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ : సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీ లో అంగన్వాడీలను చేర్చుతామని చెప్పారు.అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులకు లాభం చేకురుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కేబినెట్ లో ఆమోదం : ఈ వారంలోనే తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ అంశాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పీఆర్సీ ఏర్పాటు..డీఏ విడుదల..ఐఆర్ ప్రకటన పైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని సమాచారం. మాజీ సీఎస్ ఎస్కే జోషిని పీఆర్సీ నూతన కమిటీ ఛైర్మన్ గా నియమిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కమిటీ నివేదిక వచ్చే వరకూ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో, ఈ కేబినెట్ భేటీ వైపు ఉద్యోగులకు ఆసక్తిగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+