నేను మీ కేసీఆర్‌ను: త్వరలో వీడియోలు, 'సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే, 100 సీట్లు'

హైదరాబాద్: నేను కేసీఆర్‌ను... పద్నాలుగేళ్ల పోరాటంలో తెలంగాణను సాధించి, మీ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపాం, సంక్షేమానికి కృషి చేశాం, మళ్లీ ఇప్పుడు మీ ముందుకు మరోసారి వస్తున్నాం, ఆశీర్వదించండి... అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసార మాధ్యమాలలో కనిపించనున్నారు.

ఇందుకు అనుగుణంగా గత అయిదు రోజుల్లో పదికి పైగా సందేశాలను ముఖ్యమంత్రిపై చిత్రీకరించారట. మూడు, అయిదు నిమిషాల నిడివితో ఇవి ఉంటాయి. దీని గురించి సీఎం చెప్పిన అనంతరం, పథకాలు, ప్రజలకు చేసిన వాటి గురించి చెప్పనున్నారు. త్వరలో ఇవి విడుదల కానున్నాయి.

టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం

టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం

టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలలో వీటిని ఉపయోగిస్తారు. ప్రచార సభల్లోను వీటిని ఉపయోగించనున్నారు. కేసీఆర్ గురువారం గజ్వెల్ నియోజకవర్గంలో నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఎన్నికల ప్రచారం తదిర అంశాలపై చర్చించారు. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.

 అన్ని సర్వేలు మనకే అనుకూలం

అన్ని సర్వేలు మనకే అనుకూలం

జాతీయ, తెలుగు టీవీ ఛానల్స్ చేసిన సర్వేలలో తెలంగాణలో టీఆర్ఎస్ వంద స్థానాలు గెలుస్తుందని వెల్లడవుతోందని, మరోమారు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని హరీష్ రావు చెప్పారు. 2014లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు తొమ్మిదింటిని గెలుచుకున్నామని, కాంగ్రెస్ జహీరాబాద్‌లో గెలిచిందని, ఇప్పుడు అక్కడా తెరాసనే గెలిచి మొత్తం పది స్థానాలు దక్కించుకోవాలన్నారు.

కాంగ్రెస్ పొర్లు దండాలు

కాంగ్రెస్ పొర్లు దండాలు

తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రపడిన టీడీపీ, కోదండరాం పార్టీతో పొత్తు కోసం కాంగ్రెస్ వారు పొర్లుదండాలు పెడుతున్నారని హరీష్ రావు అన్నారు. వారికి ప్రతిపక్ష హోదా మాత్రమే దక్కుతుందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో ప్రగతి కోసం ఒక్క అడుగు పడలేదన్నారు. నాడు పదవుల కోసం నోరు మూసుకున్నారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అత్యధికి నిధులు చిత్తూరుకు దోచిపెట్టినా ఎవరూ మాట్లాడలేదన్నారు.

ఆంధ్రా నాయకుల తోక పట్టుకొని తిరిగేవాళ్లు

ఆంధ్రా నాయకుల తోక పట్టుకొని తిరిగేవాళ్లు

కాంగ్రెస్ నేతలది బానిసత్వం మనస్తత్వం అని హరీష్ రావు అన్నారు. ఆంధ్రా నాయకుల తోక పట్టుకొని తిరిగే పని వాళ్లు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించే పరిస్థితుల్లో లేరన్నారు. టీఆర్ఎస్ ప్రజల పక్షపాతి అని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెరాస పథకాలు అమలు చేస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+