ఎమ్మెల్యేలు అక్కడే ఉండండి - మొన్నటి కంటే తీవ్రంగా : సీఎం కేసీఆర్ హెచ్చరిక..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు- ప్రజా ప్రతినిధులు - ప్రజలను అప్రమత్తం చేసారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొన్నటికంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదమని సీఎం పేర్కొన్నారు. నదులు, ఉప నదులు పొంగుతున్నాయని అలర్ట్ చేసారు. మరో మూడ్రోజులు భారీ వర్షాలున్నాయన్నారు. మొన్నటికంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఎల్లుండి వరకు గోదావరి ఉధృతంగా ఉంటుందన్నారు. గోదావరి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని అంచనా వేసారు.

ఇది పరీక్షా సమయం
ప్రభుత్వ యంత్రాగాన్ని ఇది పరీక్షా సమయంగా పేర్కొన్నారు. పని కేంద్రాలను ఉద్యోగులు వదిలి వెళ్లొద్దని సీఎం నిర్దేశించారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై .. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది తన జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతున్నదని అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. దీంతో..గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయన్నారు.
2.

ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
ఈ నేపథ్యంలో పడ్డ చుక్క పడ్డట్టే వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయంగా సీఎం అప్రమత్తం చేసారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ మేరకు తక్షణమే ర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.

ఎమ్మెల్యేలు అలర్ట్ గా ఉండండి
వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications