ఇదే ఫైనల్: 31 జిల్లాల తెలంగాణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలివే

హైదరాబాద్: 30 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రజల డిమాండ్‌ మేరకు సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దసరా నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయన్న కేసీఆర్ వెల్లడించారు.

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతీ జిల్లాలో స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని సూచించారు.

ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నమని తెలిపారు. పేదరిక నిర్మూలన, సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

CM KCR green signal to 30 districts In Telangana

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, పర్యవేక్షణ లోపం కారణంగా అవి అనుకున్న మేరకు ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంతవరకు అశాంతి, అలజడి ఉంటుందని తెలిపారు.

ప్రజలక సౌకర్యం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని ఇందులో భాగంగా జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా పరవాలేదని సీఎం వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలంతా దసరా రోజున సంతోషంగా ఉంటే సిరిసిల్ల, గద్వాల, జనగామ ప్రజల బాధతో ఉండటం మంచిది కాదన్నారు.

తెలంగాణ రాష్ర్టానికి మంచి ఆదాయవనరులున్నాయని పేర్కొన్నారు. వాటిని తెలివిగా ఉపయోగించుకుని పేదరికంపై యుద్ధం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 2022 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు. అప్పటిలోగా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.

2017 డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి రాబోయే 7,8 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలను సిద్దం చేశామని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు పెరిగాయని తెలిపారు.

కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల వివరాలు:

* వరంగల్‌ను ఐదు జిల్లాలుగా విభజించారు. మహబూబాబాద్‌, జయశంకర్‌ జిల్లా, వరంగల్‌, హన్మకొండ, జనగామ.
* మహబూబ్‌నగర్‌‌ను నాలుగు జిల్లాలుగా విభజించారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల.
* కరీంనగర్‌‌ను నాలుగు జిల్లాలుగా విభజించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల.
* ఆదిలాబాద్‌ మూడు జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొమురం భీం.
* నల్గొండ జిల్లా మూడు జిల్లాలుగా విభజించారు. యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ.
* రంగారెడ్డి జిల్లా మూడు జిల్లాలుగా విభజించారు. శంషాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌.
* మెదక్‌ జిల్లా మూడు జిల్లాలుగా విభజించారు. మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట.
* నిజామాబాద్‌ను రెండు జిల్లాలుగా విభజించారు. నిజామాబాద్‌, కామారెడ్డి.
* ఖమ్మం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. ఖమ్మం, కొత్తగూడెం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+