మునుగోడు ఎన్నికల ప్రచారంలోకి సీఎం కేసీఆర్ - తాజా సర్వే నివేదికలతో..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మనుగోడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 30వ తేదీన సీఎం కేసీఆర మునుగోడు ఎన్నికల సభలో పాల్గొంటారు. గత నెలలో సీఎం కేసీఆర్ మునుగోడు ఎన్నికల సభలో పాల్గొన్నారు. అప్పటికీ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. నవంబర్ 1వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 3వ తేదీ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రులు - ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన గ్రామాలు - మండలాల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావటంతో ఈ ఎన్నికలో గెలుపును సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.

మునుగోడులో ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తున్నారు. మునుగోడులో గత ప్రచార సభలో ఎక్కువగా కేంద్రం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయం పైన విమర్శలు చేసారు. గత ఉప ఎన్నికలకు భిన్నంగా ఈ సారి కొత్తగా ఎన్నికల నిర్ణయాలు.. నిధుల కేటాయింపు వంటివి లేకుండానే బై పోల్ ప్రచారంలోకి టీఆర్ఎస్ దిగింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్దులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న గౌడ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకొనేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకుంది.
ఆయన బీజీపీకి అనుకూలంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గంలో తమకు ఉన్న పట్లును ఓట్లుగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ ఏ పార్టీ నేతలతోనూ కలిసినట్లుగా సమాచారం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ అనే విధంగా పోటీ ఉంటుందని పార్టీ ప్రకటన సమయంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మనుగోడు కేంద్రంగా తన పార్టీకి సంబంధించిన లక్ష్యాలను వివరించే అవకాశం ఉంది. ఇక, పలు సర్వే సంస్థలు మునుగోడులో ఓటర్ల నాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ అధికార టీఆర్ఎస్ ముందు స్థానంలో ఉందని..తమదే గెలుపని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

CM KCR Likely to participate in public meeting at Munugode on 30rd of this month

ఇప్పుడు ప్రచారం ఊపందుకున్న తరువాత పార్టీల మధ్య ఉన్న తేడా తగ్గుతూ.. హోరా హోరీ పోరుగా కనిపిస్తోందని సమాచారం. అందులో భాగంగా పార్టీలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..అంతర్గతంగా మాత్రం చెబుతున్న సులువుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవని చెబుతున్నారు. దీంతో..ఏ రకంగానూ ప్రత్యర్ది పార్టీలకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మునుగోడు ఎన్నికల ప్రచారంలో సభలో పాల్గొనాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+