ఎన్నికల వేళ కేసీఆర్ మార్క్ డెసిషన్ - ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం పై గురి పెట్టారు. ఇప్పటికే పార్టీ అభ్యర్దులను ప్రకటించి ఎన్నికల రేసులో ముందు నిలిచారు. అటు కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్దుల కసరత్తులో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ గ్యారంటీ ప్రకటనలతో గెలుపు పైన భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా.. ప్రధాన ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టారు. కీలక ప్రకటనకు సిద్దమయ్యారు.

ఎన్నికలకు సిద్దం: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతోంది. మరో పది రోజుల్లో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ అభ్యర్దులను ప్రకటించిన కేసీఆర్..నియోకవర్గాల్లో ఎన్నికల వేళ సహజంగా ఎదురయ్యే అంతర్గత సమస్యలు..పార్టీ మార్పులు వంటి వాటి పరిష్కారం పైన ఫోకస్ చేసారు.

CM KCR planning to announce party manifesto on Vijayadasami for next Elections

ఇక, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్దుల ప్రకటన తరువాత అవసరమతే జాబితాలో మార్పులు తప్పవని భావిస్తే తీసుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా హైదరాబాద్ వేదికగా గ్యారంటీ నిర్ణయాలను ప్రకటించారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఈ ప్రకటలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయని..అధికారం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్రధాన ఓట్ బ్యాంక్ లక్ష్యం: ఇదే సమయంలో కాంగ్రెస్ గ్యారంటీ నిర్ణయాలకు కౌంటర్ గా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు.

రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము తదితర అనేక పథకాలను రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేలా అభిప్రాయ సేకరణ సాగుతోంది. ఈసారి రైతులతో పాటు యువత, మహిళలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు.

CM KCR planning to announce party manifesto on Vijayadasami for next Elections

దసరా నాడు మేనిఫెస్టో: అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకాలు, హామీలతోపాటు ఇప్పటికే ఉన్న వాటిని మరింత ప్రయోజనాలతో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు లను సీఎం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

వ్యవసాయ రుణాలపై లక్ష వరకు రుణమాఫీని ఈసారి ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా అన్ని రకాల ఆసరా పింఛన్‌లను కూడా 1000 పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమలు చేయని ప్రధాన హామీగా మిగిలిన నిరుద్యోగ భృతి పైన స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో, కేసీఆర్ దసరా నాడు ప్రకటించే మేనిఫెస్టోలో అంశాలపైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+