కఠినంగా శిక్షిస్తాం: వరంగల్ గిరిజన బాలికల మృతి కేసుపై కెసిఆర్
వరంగల్: జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థినులు ప్రియాంక, భూమికల మృతి పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు స్పందించారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విషయమై మాట్లాడారు.
గిరిజన విద్యార్థినుల మృతి కేసు నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. వరంగల్ పర్యటనలో ఉన్న కెసిఆర్‌ను మృతి చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఒక్కో విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
అదే విధంగా విద్యార్థినుల మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా చెక్కపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు భూమిక, ప్రియాంకలు అనుమానాస్పదరీతిలో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.

యాదాద్రి మెట్రో రైల్ స్థలాన్ని పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి
నల్గొండ జిల్లా రాయగిరి దగ్గర ఉప్పల్ - యాదాద్రి మెట్రో రైల్ లైన్ ప్రతిపాదిత స్థలాన్ని ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రికి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా మెట్రో రైలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాన్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు క్షేత్ర స్థాయిలో నిపుణులతో కలిసి పరిశీలన చేశామని, యాదాద్రి మెట్రో రైల్ నిర్మాణానికి తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించామని, ఈ నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications