CM KCR: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు..
సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. సతీమణి శోభతో కలిసి ఆయన రోడ్డుమార్గంలో బస్సులో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బస్సులోనే ఉండి కొండ చుట్టూ గిరి ప్రదిక్షణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్లారు.
కేసీఆర్ దంపతులు కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల ఆశీర్వాదాలు తీసుకోనున్నారు. యాదాద్రి గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో ప్రకటించిన 16 తులాల బంగారాన్ని అందజేసి మొక్కు చెల్లించుకోనున్నారు సీఎం దంపతులు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను స్వామివారి ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారని సమాచారం.

బాలాలయం ఆవరణలో కళావేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కేసీఆర్ జాతీయ పార్టీ పేరును బీఆర్‌ఎస్ అని పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించట్లు తెలుస్తోంది. దీనిపై పండితులు, జ్యోతిష్కులతో కేసీఆర్ చర్చిస్తారని సమాచారం. వారితో మాట్లాడాక తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. కేసీఆర్ తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.












Click it and Unblock the Notifications