మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం.. 95-103 సీట్లు గెలుస్తాం : ముందస్తు ఊసేలేదన్న కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయంటూ వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాడెవడో కుక్కగాడు మొరిగితే ముందస్తు ఎన్నికలకు వెళతమా? అని నిలదీశారు. తమ టీఆర్ఎస్ ప్రభుత్వానికి 103 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేనే లేదని తేల్చి చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఊసేలేదు..
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవవసరం వచ్చిందనన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఊసేలేదన్నారు . ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ఇతర అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది. కనుకనే 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే..
తెలంగాణ ప్రగతి పథంలో దూకుకెళ్తోందన్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడెవడో కుక్కగాడు ఇష్టం వచ్చినట్లు మొరుగుతుంటే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తామా..? మా కేమైనా పిచ్చికుక్క కరిచిందా ? అని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Recommended Video

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 స్థానాల్లో విజయం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో ఘన విజయం సాధించడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తమకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని తేల్చిచెప్పారు. ఎవడో పిచ్చి సన్నాసులు, మెదడు లేని వెదవులు చెప్పినంత మాత్రానా తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లమని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications