కెటిఆర్‌కు 'కీ'లక శాఖలు, హరీష్ వద్దన్న మైనింగ్ అప్పగింత: తలసానికి షాక్, ఎవరికి ఏది?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు కీలక శాఖలను అప్పగించారు. అదే సమయంలో మంత్రి హరీష్ రావు వదులుకున్న మైనింగ్ శాఖను తనయుడికి అప్పగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా ఝలకిచ్చారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదుగురు మంత్రులకు చెందిన శాఖలను మార్పులు చేశారు. కెటిఆర్‌కు కీలకమైన శాఖలను అప్పగించారు. వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా (మిషన్ కాకతీయ)లను ముఖ్యమంత్రి కెసిఆర్ తన వద్దే ఉంచుకున్నారు.

కెటిఆర్‌కు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్, విదేశీ వ్యవహారాల శాఖలను అప్పగించారు. తనకు పని ఒత్తిడి పెరుగుతోందని, మైనింగ్ శాఖ వద్దని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. అదే మైనింగ్ శాఖను కెటిఆర్‌కు అప్పగించారు.
ఇక, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. వాణిజ్య పన్నుల స్థానంలో ఆయనకు ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగించారు.
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అదనంగా సహకార శాఖను అప్పగించారు. మంత్రి జూపల్లి కృష్ణా రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించారు. కాగా, తలసాని నుంచి వాణిజ్య శాఖను తీసుకొని తన వద్ద అట్టిపెట్టుకోవడం, హరీష్ రావు వద్దన్న మైనింగ్ శాఖను కెటిఆర్‌కు అప్పగించడం గమనార్హం. వాణిజ్యం, మిషన్ భగీరథ వంటి కీలక శాఖలను కెసిఆర్ అట్టిపెట్టుకున్నారు.
- ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి వద్ద ఉంది. దానిని కెటిఆర్‌కు అప్పగించారు. బదులుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇచ్చారు.
- తలసాని వద్ద ఉన్న కీలకమైన వాణిజ్య శాఖను కెసిఆర్ తాను తీసుకున్నారు.
- హరీష్ రావు వద్దని చెప్పిన మైనింగ్ శాఖను కెటిఆర్‌కు అప్పగించారు.
- సహకార శాఖ ఇప్పటి దాకా మంత్రి జగదీశ్వర్ రెడ్డి వద్ద ఉంది. ఇప్పుడు దానిని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications