అల్లుడితో కలిసి ముంబైలో దిగిన సీఎం కేసీఆర్: ప్రత్యేక ఏర్పాట్లతో తలసాని సిద్ధం
హైదరాబాద్/ముంబై: తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముంబైకి చేరుకున్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ముంబై వెళ్లారు.
సీఎం కేసీఆర్ వెంట సీఎస్ రాజీవ్‌శర్మ, మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఉన్నారు. గోదావరి నదిపై నిర్మించనున్న ఐదు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర సర్కారుతో బుధవారం ముంబైలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, దేవేంద్ర ఫడ్నవీస్‌ల సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు.

సీఎంకు ఘనస్వాగతం పలుకుతాం, ప్రత్యేక రథం: తలసాని
మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నదిపై నిర్మించనున్న ఐదు బ్యారేజీలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ముంబై వెళ్లిన సీఎం కె చంద్రశేఖర్‌రావు మంగళవారం తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈ విషయమై మంత్రి తలసాని మాట్లాడుతూ.. రేపు(మంగళవారం) సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఘన స్వాగతం పలుకుతామని వెల్లడించారు. ఇందు కోసం ప్రత్యేకంగా చైతన్య రథం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొని సీఎంకు స్వాగతం పలుకుతారని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసు ఉన్నతాధికారులతో తలసాని చర్చించారు.












Click it and Unblock the Notifications