జూన్ 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్: భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాలో జూన్ 4న పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి.. నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని మంత్రి తెలిపారు.

CM KCR to visit Nirmal district on June 4th.

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్‌లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 9 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి.. ప్రతీ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాలను నిర్మించారని తెలిపారు.

సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సభ ఏర్పాటుకు జూన్ 2 వరకు అన్ని పనులు పూర్తి చేయాలని, సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అటవీశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి

అటవీ శాఖలో ఖాళీల భర్తీని టీఎస్​పీఎస్సీతో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్​మెంట్ జరిగేలా చూడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలున్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. శాఖా పరంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, పదేళ్ల ప్రగతిని అన్ని వర్గాలకు వివరించాలన్నారు. నిర్మల్​లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని మంత్రి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+