వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సడెన్ షాకిచ్చిన కేసీఆర్... అనూహ్య తనిఖీ.. అధికారుల ఉరుకులు,పరుగులు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు,మీడియాకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. సీఎం అనూహ్య తనిఖీలతో అధికారులు ఉరుకులు,పరుగులు పెట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్.. అధికారులకు పలు కీలక సలహాలు,సూచనలిచ్చారు.

అధికారులు,రైతులతో మాట్లాడిన సీఎం..

అధికారులు,రైతులతో మాట్లాడిన సీఎం..

సీఎం రాక గురించి తెలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కొండపోచమ్మ కుడి,ఎడమ కాలువలను నిర్మించాలని ఆదేశించారు. స్థానిక రైతులతో మాట్లాడి.. కొండపోచమ్మకు దిగువన ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే మల్లన్న సాగర్ కాలువల పనుల గురించి ఆరా తీశారు. సాగర్‌లో స్నానాలకు ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు.

కాలువల నిర్మాణంపై సూచనలు

కాలువల నిర్మాణంపై సూచనలు

నైరుతి రుతుపవనాల రాకతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల కొత్తగా నిర్మించిన కాలువలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయంటూ సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాలువల నిర్మాణాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కొండపోచమ్మ సాగర్ అధికారులతో చర్చించినట్టు సమాచారం. అలాగే కొండపోచమ్మ నీటి సామర్థ్యం గురించి అధికారులను ఆరా తీసిన సీఎం.. రిజర్వాయర్ కట్టపై కలియ తిరుగుతూ అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

Recommended Video

Chintamaneni Prabhakar అరెస్ట్, పోలీసులతో చింతమనేని ఘర్షణ, తోపులాట Video
కాళేశ్వరం నుంచి కొండపోచమ్మకు నీళ్లు..

కాళేశ్వరం నుంచి కొండపోచమ్మకు నీళ్లు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మిడ్‌ మానేరు రిజ ర్వాయర్‌ (25.87టీఎంసీ) నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్‌, (ఇమామ్‌బాద్‌), రిజర్వాయర్‌ల ద్వారా కొండపొచమ్మకు ఈ నెల మే 29న నీటిని విడుదల చేశారు. సుమారు రూ.1600కోట్లు వ్యయంతో 15టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. నిజానికి కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మిడ్ మానేరు మీదుగా రంగనాయక సాగర్‌కు,అక్కడి నుంచి మలన్నసాగర్‌కు వెళ్లాలి. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టుకు రావాలి. కానీ మల్లన్నసాగర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. నీటిని దిగువకు మళ్లించారు. అలా కొండపోచమ్మకు మర్కూర్ పంప్ హౌజ్ ద్వారా నీటిని తరలించారు.

English summary
Telangana CM KCR visited Kondapochamma sagar in siddipet district without giving any information to media and officials. Officers were shocked after seen CM at Kondapochamma project,he gave some key instructions to build canals from project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X