రేపు కొండగట్టుకు CM KCR; అద్భుత క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం, షెడ్యూల్ ఇదే!!
రేపు కొండగట్టుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అద్భుతమైన క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం రూపు దిద్దుకోవటంపై కేసీఆర్ దృష్టి సారించారు.
ఫిబ్రవరి 15వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేసి, సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి గురించి, చేపట్టవలసిన పనులను గురించి అక్కడ అధికారులతో మాట్లాడనున్నారు.

రేపు కొండగట్టుకు కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటన రేపు కొనసాగనుంది. ముందుగా అనుకున్న మేరకు ఆయన ఈనెల 14వ తేదీన కొండ గట్టును సందర్శించాల్సి ఉంది. అయితే కొండగట్టులో మంగళవారం రోజున భక్తుల సందడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నందున సీఎం పర్యటన ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న కేసీఆర్ ఈ మేరకు నేరుగా కొండగట్టుకు వెళ్తున్నారు.

కేసీఆర్ కొండగట్టు పర్యటన షెడ్యూల్ ఇలా
ఇటు సోమవారం సీఎంవో కార్యాలయ అధికారులు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. 15వ తేదీన (బుధవారం) ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి సీఎం బయలుదేరి 9.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 9.40 గంటలకు కొండగట్టు దేవస్థానానికి చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఆలయ అభివృద్ధిని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంప్‌సలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కొండగట్టులో కేసీఆర్ క్షేత్రస్థాయి పరిశీలన
కొండగట్టు పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రేపు కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, బేతాళ స్వామి ఆలయంతో పాటు అక్కడి పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆలయ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో పుణ్యక్షేత్రమైన కొండగట్టును అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దే మహా యజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఇప్పటికే యాదాద్రిని పునర్నిర్మాణం చేసి తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దారు. ఈ తరహాలోనే కొండగట్టును కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని కృత నిశ్చయంతో ఉన్న కేసీఆర్ రేపు కొండగట్టుకు వెళ్ళనున్నారు.

కొండగట్టుకు కేసీఆర్.. ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై చర్చ
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో త్వరలో కొండగట్టు దశ, దిశ రెండు మారిపోతాయని భక్తులు భావిస్తున్నారు. కేసీఆర్ ఫిబ్రవరి 15వ తేదీన కొండగట్టు ఆలయానికి చేరుకొని స్వామిని పూజించి, ఆపై అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తారు. ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొండగట్టు ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయాన్ని పరిశీలించి వచ్చారు. పునర్నిర్మాణ ప్రణాళికను రూపొందించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు.

కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్.. ఇటీవలే అంజన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్
సీఎం కేసీఆర్ ఆలయాల పునర్నిర్మాణాలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం యాదాద్రి తరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొండగట్టు అంజన్నకు ఉన్న ప్రాసస్యం అంతా ఇంతా కాదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టు ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి, ఆయన ప్రచారరితమైన వారాహి వాహనానికి పూజలు చేయించుకుని వెళ్లారు.

లక్షలాదిగా కొండగట్టుకు భక్తులు..
తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొండగట్టు ఆలయానికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది సంఖ్యలో భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించడం, అందుకు ఈనెల 15 నుండి రంగంలోకి దిగుతుండడం అంజన్న భక్తులకు సంతోషం కలిగిస్తుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications