కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు: రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

భువనగిరి: ప్రపంచం తలకిందులైనా రుణమాఫీని ఆపమని, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్​ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. భువనగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ​కుమార్​ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్​ మీటింగ్​‌లో పాల్గొని ప్రసంగించారు రేవంత్. మూడు లక్షల మెజారిటీతో చామలను గెలిపించి ఢిలీకి పంపాలని కోరారు.

భువనగిరి కోట, కాంగ్రెస్‌ కంచుకోట అని ఎన్నోసార్లు ఇక్కడి ప్రజలు నిరూపించారన్నారని రేవంత్ చెప్పారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కార్​, కేసీఆర్ గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాడు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ప్రవేశం ఉండేది కాదని గుర్తు చేసిన రేవంత్ ​రెడ్డి.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్‌ కంచెలు కూలాయన్నారు.

CM post Revanth reddy interesting comments on minister komatireddy venkat reddy

ఎన్నో రైతు ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులకు కేసీఆర్‌, ఏనాడూ గౌరవించలేదని రేవంత్ మండిపడ్డారు. కానీ, ఈ దఫా ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని దించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వచ్చారని వ్యాఖ్యానించారు. పదేళ్లు మోడీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆరోపించారు.

కోమటిరెడ్డి సీం పదవికి అర్హుడు

భువనగిరి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడని వ్యాఖ్యానించారు రేవంత్. ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని.. కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని రేవంత్ ప్రశంసించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+