రైతుబంధు అమల్లో కీలక మార్పులు, వారికి వర్తించదు - రేవంత్ క్లారిటీ..!!
రైతుబంధు అమల్లో మార్పుల పైన సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వ్యవసాయ భూములకే రైతుబంధు అమలు చేస్తామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల పైన రేవంత్ స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాల్లో అవినీతి పైన విచారణ చేస్తున్నామని వెల్లడించారు.
రైతుబంధ అమలు గురించి ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సాగులో ఉన్న భూములకే రైతు బంధు అందుతుందని స్పష్టం చేసారు. వ్యవసాయం చేసే రైతులకు రైతుబంధు అందాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి సాయం కావాల్సింది రైతులకేనని వివరించారు. హైవేలు, రియల్ ఎస్టేట్ లో ఉన్న భూములకు రైతు బంధు అందదని చెప్పారు. రైతు బంధు అమలు పైన అన్ని విషయాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వాస్తవాలు చెబుతున్నామన్నారు. తొలి రోజునే రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచామని గుర్తు చేసారు.

గత ప్రభుత్వం మాదిరిగా తాము అసత్యాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టలేదన్నారు. మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. విచారణ తర్వాతే చర్యలుంటాయని చెప్పారు. తమ ఎమ్మెల్యేలనే కాదు... ప్రతిపక్షాలనూ అక్కడికి తీసుకెళ్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తామని కీలక వ్యాఖ్యలు చేసారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారని.. ఈ విషయంపై ఆయన్నే అడగాలని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్థూపంలో అవినీతిని బయటకు తీస్తామని రేవంత్ స్పష్టం చేసారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications