జాబ్ క్యాలెండర్ జారీ, భర్తీ విధానంపై రేవంత్ కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి తీసుకొంటున్న చర్యల పైన స్పష్టత ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రేవంత్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ కు చట్ట బద్దత కల్పిస్తామని చెప్పారు. 10-50 నిష్ఫత్తిలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుందని రేవంత్ తేల్చి చెప్పారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు ఖాళీ అయ్యే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ వెల్లడించారు.
రేవంత్ క్లారిటీ
ముఖ్యమంత్రి రేవంత్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ పైన స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్చోగాల నియమాకం జరుగుతుందని ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 1:50 రేషియోలోనే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 1:100 పిలవాలని కొందరు కోరుతున్నారని చెప్పారు. అలా చేయటానికి తమకు అభ్యంతరం లేకపోయినా..న్యాయస్థానాల్లో సమస్యలు వస్తాయన్నారు. గ్రూపు -1 వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుందన్నారు. కొందరు చేస్తున్న దీక్షల పైనా రేవంత్ స్పందించారు. దీక్ష చేసిన వారు ఏ పరీక్ష రాసిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు.

నోటిఫికేషన్లు - భర్తీ
పరీక్ష రాయని వారు పరీక్ష వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని రేవంత్ అసహనం వ్యక్తం చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రేవంత్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ కు ఎక్కడా లేని విధంగా చట్ట బద్దత కల్పిస్తామని స్పష్టం చేసారు. మార్చి నెలాఖరు వరకు అయ్యే ఖాళీల వివరాలు తెప్పించి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని...షెడ్యూల్ లో చెప్పిన విధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని రేవంత్ స్పష్టం చేసారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
ఆ కోర్సులు కొనసాగాలి
ఈ సంవత్సరం నుంచి కళాశాలలకు ఫీజు బకాయిలు లేకుండా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.కళాశాలల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానిక్ కోర్పులు ఖచ్చితంగా నడపాలని సూచించారు, కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు. పక్క రాష్ట్రాలతో మాత్రమే కాకుండా ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్దులు తయారు కావాలని రేవంత్ సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications