తెలంగాణ కొత్త డీజీపీ ఖరారు, సజ్జనార్ బాధ్యతల మార్పు ..!?
తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం పైక కసరత్తు జరుగుతోంది. పాలనా పరంగా కొద్ది రోజులుగా సీఎం రేవంత్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణా రావు పదవీ కాలాన్ని పొడిగించారు. అదే విధంగా ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో, ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎవరనేది పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారికే డీజీపీ పగ్గాలు ఇస్తారని సమాచారం. ఆ అధికారి వైపే రేవంత్ మొగ్గు చేపే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనేదానిపై చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా డీజీపీ నుంచి కీలక విభాగాల్లో మార్పులు తప్పవని తెలుస్తోంది. కాగా, కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సీవీ ఆనంద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాను విజిలెన్స్‌కు, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ (పీ అండ్ ఎల్) రమేశ్ సహా పాటు మరికొందరు ముఖ్య అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీపైన కసరత్తు కొనసాగుతోంది.
కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతితో గడువు పెంచి కొనసాగిస్తున్నట్లుగానే డీజీపీ జితేందర్‌ను కూడా కొనసాగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో, కొత్త డీజీపీ నియామకం పైన సీఎం రేవంత్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. నిమజ్జనం తరువాత పోలీసు అధికారుల బదిలీలు.. పోస్టింగ్స్ పైన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications