అక్బరుద్దీన్ కు రేవంత్ బంపరాఫర్ - బిగ్ టర్న్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. తాజా బడ్జెట్ లోనూ హైదరాబాద్ కు ఏకంగా రూ 10వేల కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో ఎంఐఎం తో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కు ముఖ్యమంత్రి బంపరాఫర్ ఇచ్చారు. అక్బర్ అంగీకరిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని వెల్లడించారు.
అసెంబ్లీ వేదికగా
తెలంగాణ అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో పైన చర్చ జరిగింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ...పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదన్నారు.

పాతబస్తీ మెట్రో పై
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంఖుస్థాపన చేశామన్నారు. రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మాణానికి టెండర్లు గత ప్రభుత్వం పిలిచిందన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అక్బర్ కు రేవంత్ ఆఫర్
ఇదే సమయంలో రేవంత్ రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను మెట్రోలోనే చాంద్రాయణ గుట్టకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పారు. ఇక, అక్బరుద్దీన్ కాంగ్రెస్ నుంచి కొడంగల్ అభ్యర్దిగా పోటీ చేస్తే గెలిపిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. అక్బర్ ముందుకు వస్తే నామినేషన్ వేయించటంతో పాటుగా గెలుపు వరకు తానే బాధ్యత తీసుకుంటానన్నారు. అక్బర్ ను డిప్యూటీ సీఎం చేస్తానని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల నాటికి మెట్రో రైల్‌లో ఓల్డ్ సిటీలో తిరుగుతాం.. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతాం. కేంద్రం నిధులు ఇచ్చినా. ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications