ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్దిగా, ఫిక్స్ చేసిన రేవంత్ - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు.. సుప్రీంకోర్టు సమర్థించటంతో ఇక ఉప ఎన్నిక ఖాయమైంది. విజయారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా న్యాయ పరమైన చిక్కులు తొలిగిన వెంటనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది పార్టీలో కీలక చర్చగా మారింది. అయితే, సీఎం రేవంత్ పార్టీ అభ్యర్దిత్వం పైన స్పష్టత ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ నిర్ణయం పార్టీలో ఆసక్తిగా మారుతోంది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన కొంత కాలంగా చర్చ సాగుతోంది. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయటంతో తిరిగి ఆయనే కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారని అందరూ భావించారు. కాగా, పలువురు సీఎం రేవంత్ సన్నిహితుల పేర్లు తెర మీదకు వచ్చాయి. దీంతో పాటుగా ఉప ఎన్నికలో పోటీ చేయటానికి దానం సైతం కొన్ని షరతులు పెడుతున్నట్లు ప్రచారం సాగింది. ఢిల్లీ నేతలతో నూ దానం నాగేందర్ చర్చలు చేసారు. కాగా.. కాంగ్రెస్ లోకి వచ్చి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన కారణంగానే దానం పైన అనర్హత వేటు పడింది.

దీంతో.. కాంగ్రెస్ నుంచే ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే చర్చ వినిపించింది. దీనికి అనుగుణంగా తాజాగా సీఎం రేవంత్ పార్టీ నేతలకు ఖైరతాబాద్ అభ్యర్ధి పై స్పష్టత ఇచ్చారు. దానం నాగేందర్ పార్టీ అభ్యర్దిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. తాము ఏ ఎన్నికనైనా సరే చాలా సీరియస్‌గా తీసుకుంటామని, అది చిన్న ఎన్నికైనా, పెద్ద ఎన్నికైనా తమ వ్యూహం మారదని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలను ఎప్పుడూ తేలికగా తీసుకోలేదని, అలా తీసుకుంటే తాము ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే, ఉప ఎన్నిక పైన న్యాయ పరమైన సమస్యలు తెర మీదకు వచ్చాయి. విజయారెడ్డి వంటి స్థానిక నేతల నుంచి న్యాయపోరాటాలు, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఈ ఉపఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ ఇప్పుడు దానం నాగేందర్ పేరును ఖరారు చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉన్న సందిగ్ధతను తొలగించారు.
అయినా.. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఉపఎన్నికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉపఎన్నిక అని ఖాయం కాగానే... దానం అభ్యర్దిత్వం ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు దానం కు నియోజకవర్గంలో పని చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి పైన స్పష్టత రావటంతో.. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం తమ అభ్యర్ధుల పైన నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
