తెలంగాణకు నూతన డీజీపీ - రేవంత్ మార్క్ ఎంపిక..!!

ముఖ్యమంత్రి రేవంత్ ఇక పాలనాపరంగా తన మార్కు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల స్థానచలనం తప్పేలా లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న పలువురు ముఖ్య అధికారులను మార్చాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొత్త బిజెపి నియామకం ఖాయమని తెలుస్తుంది. కొత్త డీజీపీగా రేవంత్ ఇప్పటికే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొందరు అధికారుల మార్పు ఖాయమైంది.

బదిలీలపై కసరత్తు
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు జరగనున్నాయి. సామాజిక న్యాయంతో పాటుగా సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ ఐపీఎస్ ల బదిలీల జాబితా సిద్ధమవుతోంది. రాష్ట్రానికి మరో రెండు డీజీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రవి గుప్తా, అంజనీ కుమార్, సివి ఆనంద్, జితేందర్లు డీజి హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ ఇటీవలే మరణించారు. సందీప్ శాండిల్య పదవి విరమణ పొందారు. జితేందర్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలను అప్పగించారు. అంజనీ కుమార్ ను రోడ్డు సేఫ్టీ బిజీగా పరిమితం చేశారు.

CM Revanth Govt likely to appoint new DGP and Reshuffle in police officials postions

డీజీపీగా శివధర్ రెడ్డికి ఛాన్స్
తాజాగా డీజీ హోదాలో చోటుచేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్ ఐపీఎస్ లో ఇద్దరిలో ఒకరికి డీజీ ర్యాంక్ దక్కే అవకాశం కనిపిస్తోంది.1994 బ్యాచ్ కు చెందిన అదనపు డీజీలు శివధర్ రెడ్డి, శిఖ గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, వినాయక ప్రభాకర్ ఆప్టేలలో ఇద్దరికీ డీజే రాంక్ దక్కనుంది. వీరిలో ఆప్టే కేంద్ర సర్వీస్ లో ఉన్నారు. దీంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డిలకు డీజే ర్యాంక్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సమీకరణలతో ప్రస్తుతం ఐబీ చీప్ గా ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డిజిపిగా, ఎస్ బీ చీఫ్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎంపిక లాంఛన ప్రాయమేనని పోలీస్ ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతుంది.

సమూల ప్రక్షాళన
రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఏసిపి లు, ట్రాఫిక్ కమిషనర్ వంటి ఖాళీలను సమర్ధులైన అధికారులకు అప్పగించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. పోలీస్ కమిషనరేట్లు, జిల్లాలోనూ భారీ ఎత్తున పోలీస్ అధికారుల బదిలీల దిశగా కసరత్తు జరుగుతుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో 9 పోలీస్ కమిషనరేట్ లలో మార్పులు చేర్పులు ఖాయమని చెప్తున్నారు. ఈ సమయంలో తెలంగాణకు కొత్త డిజిపి గా ఎవరు నియమితులు కాబోతున్నారనేది చర్చ అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+