సినిమా చూపించిన రేవంత్ - సంక్రాంతికి 'దిల్' జారి గల్లంతైందే..!!
ఊహించిందే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ వెనుకడుగు వేయలేదు. సినీ పెద్దల ఎత్తుగడలు పని చేయలేదు. సినీ ప్రముఖులు ప్రభుత్వం గురించి ఎన్ని ప్రశంసలు కురిపించినా రేవంత్ నిర్ణయం మారలేదు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు .. టికెట్ ధరల పెంపుకు ఛాన్స్ లేదని స్పష్టం చేసారు. సంక్రాంతి సినిమాల వేళ రేవంత్ నిర్ణయంతో నిర్మాతల ఆశలు గల్లంతైంది. మరో ప్రయత్నం కోసం ఆలోచన జరుగుతోంది.
దిల్ రాజు పెద్దరికం
ముఖ్యమంత్రి రేవంత్ తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ముందుగా రేవంత్ ప్రభుత్వాన్ని సీని ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు జోక్యంతో ఈ భేటీ జరిగింది. వచ్చ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతికి దిల్ రాజు మూడు పెద్ద సినిమాలతో వస్తున్నారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాత. అలాగే 'డాకూ మహారాజ్' మూవీకి నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. సినీ పెద్దల భేటీ జరిగితే రేవంత్ కొంత శాంతిస్తారని దిల్ రాజు భావించారు. అటు ఇండస్ట్రీ.. ఇటు ప్రభుత్వం మధ్య వారధిగా వ్యవహరించి భేటీ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.

సినీ ప్రముఖుల సూచనలు
మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి హాజరు కాలేదు. మిగిలిన సినీ పెద్దలంతా తరలి వచ్చారు. భేటీ లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసు కొన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం కూడా తమను బాగా చూసుకుంటోందని చెప్పారు. దిల్ రాజు నియామకాన్ని స్వాగతించారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరా బాద్‌లో నిర్వహించాలని కోరారు. ప్రముఖ హీరో నాగార్జున యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరికగా చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు#CMRevanthReddy #RevanthReddy #TelanganaGovt #TFI #TollywoodNews #Oneindiatelugu pic.twitter.com/ILKSk0OPMd
— oneindiatelugu (@oneindiatelugu) December 26, 2024
మనసు మారని రేవంత్
చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దన శ్యాంప్రసాద్ రెడ్డి సూచించారు. వీరి అందరి ప్రసంగాలు విన్న సీఎం రేవంత్ తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సహకారం కావాలని.. అదే విధంగా సినీ పరిశ్రమకు తమ సహకారం ఉంటుం దని హామీ ఇచ్చారు. ఈవెంట్స్, బౌన్సర్ల విషయంలో సుతి మెత్తని హెచ్చరికలు చేసారు. అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు ఆశలు గల్లంతు చేస్తూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేసారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తేల్చేసారు. దీంతో, రేవంత్ మూడ్ ఇప్పట్లో మారదని సినీ పెద్దలకు అర్దమైంది. అయినా, సంక్రాంతి సినిమాల కోసం మరోసారి కొందరు ముఖ్యులతో సీఎంతో భేటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి.. అప్పటికైనా రేవంత్ మనసు మారేనా.. ఫలితం ఉంటుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications