కొండా వివాదం వేళ విదేశాల నుంచి వస్తూనే రేవంత్ బిగ్ డెసిషన్- ముహూర్తం ఫిక్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అధికార పార్టీలో.. ప్రభుత్వంలో కొండా వివాదం పతాక స్థాయికి చేరింది. సీఎం రేవంత్ పైన వ్యాఖ్యలు చేసిన కొండా పైన చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుగా నిలుస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం సైతం ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకుంది. దీంతో.. విదేశీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన సీఎం రేవంత్ ఈ వివాదం పైన కీలక నిర్ణయానికి సమాయత్తం అవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా వివాదం కొత్త మలుపు తీసుకుంది. సురేఖ కుమార్తె సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖను వివరణ కోరటంతో ఇచ్చిన సమాధానం.. ఆ తరువాత కొనసాగుతున్న పరిణామాల వేళ ఈ వ్యవహారం ఏఐసీసీకి చేరింది. తాజాగా పార్టీ చీఫ్ ఖర్గే తోనూ సురేఖ సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను వివరించారు. అయితే, పార్టీలో రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం కొండా సురేఖ తో పాటుగా సీఎం పైన విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి, చిన్నా రెడ్డి లాంటి వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన సీఎం రేవంత్ తో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సాయంత్రం భేటీ కానున్నారు. తాజా పరిణామాల క్రమంలో తమ వాయిస్ అందరి సమక్షంలో మరోసారి వినిపించేందుకు సిద్దమయ్యారు.

సీఎం రేవంత్ నిర్ణయం పై ఉత్కంఠ
కాగా, సీఎం రేవంత్ తాజా పరిణామాల పైన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ, క్రమశిక్షణా సంఘం పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇచ్చింది. కొండా సురేఖ మంత్రి పదవి పైన వేటు పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సామాజిక లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. రేవంత్ ఈ సమావేశంలో కీలక నిర్ణయానికి సిద్దమయ్యారని సమాచారం. ఇక, ఉపేక్షించకుండా తన చర్యల పైన స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో ఎస్‌ఐఆర్ రెండవ విడత పురోగతి ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణపై సమీక్షించేందుకు నేడు సాయంత్రం 5:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమావేశం జరగనుంది. దీంతో.. ఈ రోజు సమావేశాలు.. నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications