ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక పై రేవంత్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటిని కేటాయి స్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌‌ను రేవంత్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇళ్ల పథకం లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి.. రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నామని చెప్పారు. తొలిదశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని వెల్లడించారు.

పేదవాడి కల నిజం చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 4.50 లక్షల ఇళ్లకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత పేదలకే తొలి దశ నిర్మాణాల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు తొలి దశ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

CM Revanth key announcement over implementation of Indiramma housing for poor

కేసీఆర్ కు సూచన
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దరికంగా వ్యవహరించాలని.. మనస్తత్వంలో మార్పు రావాలని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. గతంలో విపక్షాలు సూచనలు ఇచ్చే సంప్రదాయం ఉండేదని గుర్తు చేసారు. ఇతర పార్టీలు అంటే శత్రు పక్షాలుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఇరుపక్షాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పెద్దమనిషిగా కేసీఆర్ సూచనలు చేయాలని హితువు పలికారు. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని...అవసరమైన సూచనలు చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవటమే పనిగా పెట్టున్నారా అంటూ రేవంత్ ప్రశ్నించారు. తాము పదవుల్లో ఉండటాన్ని జీర్ణించులోక పోతున్నారని వ్యాఖ్యానించారు.

పైలెట్ ప్రాజెక్టుగా
పేదలకు ఇళ్ల కేటాయింపులో వివక్ష .. అవినీతికి ఆస్కారం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదల కోసం ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు ఇస్తోందని గుర్తు చేసారు. ప్రతీ మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాలకు అదనంగా ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. అర్హులను గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా ఖరారు చేస్తారని వివరించారు. నిర్మాణంలో ఎలాంటి డిజైన్లకు షరతులు లేవని చెప్పిన రేవంత్ .. లబ్ ధిదారుల వారికి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవచ్చని స్పష్టం చేసారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకం అమలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+