రేవంత్ కేబినెట్ లోకి ఆ అయిదుగురు- కొత్త ఫార్ములా..!!

ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన హైకమాండ్ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్ అలర్ట్ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేసింది.

హైకమాండ్ తో చర్చలు
ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ ముఖ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ నేత కేసీ వేణుగోపాల్ లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. కుల గణన పైన నివేదికను సమర్పించారు. కాగా, మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కార్యవర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన చర్చ చేసారు. దీంతో, హైకమాండ్ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆరా తీసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు.. హామీల అమలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గం విస్తరణ కోసం ఆశావాహులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న విషయం పైన చర్చ జరిగింది.

CM Revanth key discussions with party high command over cabinet expansion and nominated posts

ప్రతిపాదనలు సిద్దం
పార్టీ ముఖ్య నేతలు చర్చించి.. తమకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు పార్టీ నేతలు చెబు తున్నారు. సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహాశ్ గౌడ్ తో పాటుగా పార్టీ ఇంఛార్జ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు దిశగా కసరత్తు జరుగుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఆమాత్యులుగా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్ ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం అంశం ప్రస్తుతం తెర మీదకు వచ్చింది.

కీలక మంత్రాంగం
ఇక, పీసీసీ కార్యవర్గం కూర్పులోనూ హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేస్తోంది. వర్కింగ్ ప్రెసిడెం ట్స్ నియామకంలో మైనార్టీ- ఎస్సీ- ఎస్టీ సమీకరణం పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. నామినేటెడ్ పెండింగ్ పదవులను ఖరారు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15 తరువాత స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, ఈ రోజు ఢిల్లీలో పార్టీ అధినాయకత్వంతో జరుగుతున్న మంత్రాంగం పార్టీ - కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+