రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!?

తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్దం అవుతోంది. కొందరు మంత్రుల పని తీరు.. వివాదాలు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగానూ కొత్త వ్యూహాల పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా మంత్రివర్గంలోకి మరో డిప్యూటీ సీఎం ను బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. మరో బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక.. పలువురి మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వం - పార్టీ పైన హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా రేవంత్ మంత్రివర్గంలో మార్పులకు సిద్దమైంది. ప్రస్తుతం భట్టి విక్రమార్క ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ నేతకు ఇవ్వాలని దాదాపు నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్లను ప్రకటించి.. న్యాయస్థానంలో తీర్పు కారణంగా అమలు నిలిచిపోయింది. దీంతో.. పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కు పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గం నుంచి భట్టివిక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ మంత్రులుగా కొనసాగుతున్నారు.

cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc

కాగా, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కాగా, మహేష్ గౌడ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే.. టీపీసీసీకి కొత్త చీఫ్‌గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరుగుతోంది. ఇక.. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్ఠానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేసారు. కానీ, మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది.

అటు మంత్రి వర్గంలో చోటు కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ కోటాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లుగా.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమకూ మంత్రి వర్గంలో స్థానం కల్పించాలంటూ పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా చేయటంతో..ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కీగౌడ్‌ ఈ మేరకు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ ఎమ్మెల్యేలు బాలూ నాయక్‌, రామచంద్రునాయక్‌ రేసులో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల తరువాత కేబినెట్ ప్రక్షాళన పైన తుది నిర్ణయం అధికారికంగా వెల్లడి కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+