కేటీఆర్ విచారణ వేళ రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగు తుందని భరోసా ఇచ్చారు. ఇటు కేటీఆర్ ఈడీ ఎదుట విచారణ హాజరు వేళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి కేటీఆర్ ప్రస్తావించారు. అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసిన విధంగా పథకాలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి చెప్పుకొచ్చారు. తాము ఏడాది కాలంలోనే తెలంగాణలో ప్రజా పాలన కోసం ఎన్నో మార్పులు తెచ్చామని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ జరగని విధంగా తమ హయాంలో 21 వేల కోట్ల మేర రుణమాఫీ అమలు చేసామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నామంటూ పథకాల వారీగా వివరించారు.

CM Revanth made interesting comments over Delhi Assembly Elections targets AAP in liquor scam

తెలంగాణలో యువతకు ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు అవుతాయని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని రేవంత్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. తెలంగాణ విషయంలో హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని ఉద్ఘాటించారు.
కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. పెట్టబడుల కోసం దావొస్ వెళ్తున్నామని రేవంత్ వివరించారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని రేవంత్ స్పష్టం చేసారు.

తెలంగాణలో తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని సీఎం రేవంత్‌ తెలిపారు. ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్తున్న రేవంత్.. అటు నుంచి దావోస్ కు వెళ్తనున్నారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టబడులు ఆకర్షించటమే తన లక్ష్యామని రేవంత్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి అయిన తరువాత రేవంత్ వరుసగా రెండో ఏడాది దావోస్ పర్యటన కు వెళ్తున్నారు. ఈ సారి రేవంత్ దావోస్ వరల్ట్ ఎకనామిక్ ఫోరమ్ లో రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించనున్నారు. అక్కడ జరిగే ఒప్పందాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+