రూ 6 లక్షలకే ఫ్లాట్, ప్రభుత్వం బంపరాఫర్ - అర్హతలు, దరఖాస్తులు, మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ చేసిన సమీక్షలో అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు. అందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలకు తీపి కబురు అందించారు. క్యూర్ పరిధిలో రూ 11 లక్షలో నిర్మించే ఫ్లాట్ ను రూ 6 లక్షలకే అందించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మార్గదర్శకాలు.. అర్హతలు ఖరారు చేసారు.

మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో 'ఇందిరమ్మ ఇండ్లు' పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలకుగాను తొలి విడతగా 16 నియోజక వర్గాల్లో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టనుంది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇళ్లను ఫ్లాట్‌ల రూపంలో లబ్ధిదారులకు అందించనుంది. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండనుండగా.. దీని నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కానుంది. ఇందులో రూ.5 లక్షలు ప్రభుత్వ వాటా కాగా, రూ.6లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. వీటికి సంబంధించి దరఖాస్తులకు ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించారు.

cm-revanth-made-key-directions-over-plans-to-construct-indiramma-houses-in-several-constituencies-wi

ప్రభుత్వం మార్గదర్శకాలు

హైదరాబాద్ కోర్ అర్బన్ ఎకానమీ రీజియన్ (CURE)లో దశలవారీగా లక్ష సరసమైన బహుళ అంతస్తుల ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఎల్ఐజి ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మీసేవా కేంద్రంలో అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ప్రభుత్వం జారీ చేసిన వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100. దీనితో పాటు రూ.10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో పేరు రాకపోతే మొత్తం EMD సొమ్ము వాపసు ఇస్తారు. ఇళ్లు దక్కించుకునే వారు రూ.6 లక్షల మొత్తాన్ని నాలుగు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే 10 ఏళ్లు ఇంటిని విక్రయించుకునే అవకాశం లేదని చెప్పారు. రుణాల కోసం మాత్రం బ్యాంకుల్లో ఆ సేల్‌డీడ్‌ను పెట్టుకునే వెసులుబాటు ఉంది. కాగా, గతంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినా ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+