తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ, అన్ స్టాపబుల్ - రేవంత్..!!
వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. తెలంగాణ లో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. మంచి సానుకూల వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది తమ లక్ష్యంగా రేవంత్ వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియగా వివరించారు.
'తెలంగాణ రైజింగ్' పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమిట్ 2025 లో రేవంత్ కీలక ప్రసంగం చసారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని గుర్తు చేశారు.

జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని, లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకుందని, అందరి సహకారంతో తాము లక్ష్యాన్ని అందుకుంటామని వివరించారు.
సోనియా, మన్మోహన్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమని అన్నారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషమని తెలిపారు. దేశజనాభాలో 2.9 శాతమే ఉన్నా 5 శాతం ఆదాయం ఇస్తున్నామని, ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించామని, 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు.
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని అన్నారు. తెలంగాణలో గ్వాంగ్‌డాంగ్ నమూనా అమలు చేయదలిచామని, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ తమకు ఆదర్శమని వివరించారు.












Click it and Unblock the Notifications