దావోస్‌లో సీఎం రేవంత్‌తో పాటు మెగాస్టార్.. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగేనా ??

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ పర్యటనలో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో WEF ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు దావోస్‌లో జరిగిన 'జాయిన్ ది రైజ్' కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.

కాగా ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్‌లో జరిగిన చర్చలు, ఒప్పందాలకు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహిస్తే పెట్టుబడుల నిర్ణయాలు వేగంగా అమలవుతాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధులకు వివరించారు. దీనివల్ల పెట్టుబడిదారులకు, రాష్ట్రానికి రెండింటికీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

cm-revanth-reddy-along-with-megastar-chiranjeevi-attends-meeting-in-davos

ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం.. ఆ సదస్సు ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తుంటామని.. కానీ ఈసారి, తెలంగాణ రైజింగ్ విజన్‌ను, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామ ని అన్నారు.

అంతే కాకుండా హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) అంతర్జాతీయ హబ్‌గా మారుతోందని సీఎం తెలిపారు. ఐటీ, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, ఏఐ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నైట్ టైమ్ ఎకానమీని ప్రోత్సహిస్తామని, దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మిస్తున్నామని, ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం వెల్లడించారు. పర్యావరణ హిత అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించారు. అదే సమయంలో తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030లను ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువులు-కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టుల వివరాలను వివరించారు. అలాగే కోర్, ప్యూర్, రేర్ అనే కొత్త ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో అపార పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, అనుభవాల పరంగా గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యం కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

cm-revanth-reddy-along-with-megastar-chiranjeevi-attends-meeting-in-davos

ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం విశేషంగా మారింది. సినీ, సాంస్కృతిక రంగాల నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు లభిస్తున్నదని ఇది సూచిస్తోంది. మరోవైపు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిరు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అని కూడా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+