Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..
లోక్ సభ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు సంక్లిష్టంగా మారింది. కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షీ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు.
ఆదివారం సాయంత్రం మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నాయి. అటు ఖమ్మం సీటు కోసం భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి తన భార్య కోసం.. పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోరుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులు
పెద్దపల్లి- గడ్డం వంశీకృష్ణ
మల్కాజ్ గిరి - సునీతా మహేందర్ రెడ్డి
సికింద్రాబాద్ - దానం నాగేందర్
చేవెళ్ల -డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
నాగర్ కర్నూల్ - డాక్టర్ మల్లు రవి
నల్గొండ - రఘువీర్ రెడ్డి
జహీరాబాద్ - సురేశ్ షెట్కర్
మహబూబాబాద్(ఎస్టీ)- బలరామ్ నాయక్
మహబూబ్ నగర్ - వంశీ చందర్ రెడ్డి
ఆదిలాబాద్ (ఎస్టీ) - ఆత్రం సుగుణ
నిజామాబాద్ - తాటిపర్తి జీవన్ రెడ్డి
మెదక్ - నీలం మధు
భువనగిరి - చామల కిరణ్ కుమార్ రెడ్డి
మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే తాగు నీటి కొరత రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎండకాలం దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications