CM Revanth Reddy: కాంస్య పతక విజేత దీప్తి జీవన్‌జీకి రూ. కోటి, 500 గజల స్థలం..
పారాలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి దీప్తి జీవన్‌జీని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సన్మానించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో దీప్తిని సీఎం ఘనంగా సత్కరించారు. ఆమెకు కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే దీప్తికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. దీప్తి కోచ్, నాగపురి రమేష్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని ఆదేశించారు.
లక్ష్యానికి వైకల్యాం అడ్డు కాదని దీప్తి నిరూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాలకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పారాలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.2024 పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల T20 ఫైనల్‌లో దీప్తి కాంస్య పతకాన్ని గెలిచిన విషయం తెలిసింది.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. దీప్తి ఈ స్థాయికి చేరడానికి ఆమె తల్లిదండ్రు కృషి ఎంతో ఉందని స్థానికులు చెబుతున్నారు. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి తమ కూతురుకు వైకల్యం ఉన్నా బాధపడకుండా ప్రోత్సహించారని పేర్కొన్నారు. తమ కుమార్తె క్రీడాల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకుంటే.. తన ఎకరం పొలాన్ని సైతం
అమ్మడానికి యాదగిరి సిద్దమయ్యాడు.
ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి గారిని ముఖ్యమంత్రి @revanth_anumula గారు సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం,… pic.twitter.com/t9ucA7DRY5
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2024
తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తను జీవితంలో ముందుకెళ్లాలని దీప్తి తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేశారని గుర్తు చేశారు. దీప్తి 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించింది.












Click it and Unblock the Notifications