తెలంగాణ మంత్రులకు శాఖల ఖరారు - సీతక్కకు కీలక బాధ్యతలు..!!
తెలంగాణలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా రేవంత్ తో పాటుగా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. హైకమాండ్ తో చర్చల తరువాత ముఖ్యమంత్రి రేవంత్ శాఖలు కేటాయించారు. మరో ఆరుగురు మంత్రుల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. కీలకమైన శాఖల ఖరారు విషయంలో రేవంత్ మార్క్ కనిపించింది. ఇక..శాఖలను అధికారికంగా ప్రకటించారు.
మంత్రులు - శాఖలు : తెలంగాణ మంత్రుల శాఖలు ఫైనల్ అయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క కేబినెట్ లో సీఎం తరువాత పోర్టుఫోలియోగా భావించే ఆర్దిక శాఖను ఖరారు చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..హామీల అమలు వేళ భట్టికి ఈ శాఖ కేటాయించారు. ఆర్దిక శాఖతో పాటుగా ఇంధన శాఖను అప్పగించారు. అదే విధంగా ఐటీ శాఖ పైన కొద్ది రోజులుగా తెలంగాణలో ఆసక్తి కనిపిస్తోంది. కేటీఆర్ ముద్ర బలంగా ఐటీ పైన ఉన్న వేళ..ఆ స్థాయిలో కాంగ్రెస్ మార్క్ చూపించేలా ఈ శాఖ ఎవరికి కేటాయిస్తారనేది చర్చ సాగింది. ఐటీ శాఖను గతంలో ఇదే శాఖ పర్యవేక్షించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అప్పగించారు. దీంతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాలు..పరిశ్రమల శాఖను కేటాయిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

సీతక్కకు ప్రాధాన్యత : ఇక, సీనియర్ నేత తుమ్మలకు కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించారు. వ్యవసాయ రంగ అనుబంధ రంగాలను కేటాయించారు సీతక్కకు ప్రాధాన్యత దక్కింది. కీలకమైన పంచాయితీరాజ్ తో పాటుగా మహిళా శిశు సంక్షేమం అప్పగించారు. మరో మహిళా మంత్రి కొండా సురేఖకు అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రెవిన్యూ, హౌసింగ్, సమాచార ప్రసార శాఖను కేటాయించారు. మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్, పౌర సరఫరాలను ఖరారు చేసారు. మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు. మెదక్ జిల్లాకు చెందిన దామోదర్ రాజనర్సింహకు ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగానే వైద్య - ఆరోగ్య శాఖను అప్పగించారు. జూపల్లి క్రిష్ణారావుకు ఎక్సైజ్ శాఖను ఖరారు చేసారు.

సీఎం వద్దే హోం శాఖ : పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమంతో పాటుగా రవాణా శాఖ కేటాయించారు. అయితే, హోం శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. మరో ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నా..మరి కొద్ది రోజులు వేచి చూసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఆరు మంత్రి పదవుల భర్తీ పైన హైకమాండ్ తో రేవంత్ చర్చించారు. కొద్ది రోజులు వేచి చూడాలని హైకమాండ్ సూచించింది. ఇక, హైదరాబాద్ నుంచి ఎవరికీ ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో..కీలకమైన హోం శాఖ బాధ్యతలను ప్రస్తుతం రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీల భర్తీ తరువాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications