మంత్రులు, ముఖ్య నేతలకు సీఎం రేవంత్ పిలుపు - కీలక నిర్ణయం..!!

సీఎం రేవంత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రులు.. పార్టీ ముఖ్య నేతలతో భేటీకి డిసైడ్ అవుతున్నారు. ఢిల్లీలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో నవంబరు 1న జరగనున్న భారీ ర్యాలీపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చర్చించి.. కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరు కానుండ టంతో తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులతో సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కీలక అంశాల పైన చర్చించనున్నారు. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న పోరాటాలు.. మద్దతు పైనా కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ ప్రకటించిన రేవంత్ రెడ్డి- ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు
తెలంగాణ పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ ప్రకటించిన రేవంత్ రెడ్డి- ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు
CM Revanth Reddy Calls Key Meeting with Ministers and Party Leaders on Friday to discuss latest developments

ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో నవంబరు 1న జరగనున్న భారీ ర్యాలీపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొననున్నారు.

కాగా.. ప్రధానంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభా వం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ప్రభు త్వం తరఫున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలేంటన్న దానిపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అదే విధంగా నవంబరు 1న ఎస్‌ఐఆర్‌కు వ్య తిరేకంగా ఢిల్లీలో జరగనున్న భారీ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని నిర్ణయించారు.

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా..
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా..

దీంతో.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం.. అవసరం గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఇక మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ నవంబరు 6న ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఓటరు నమోదు కార్యాచరణ వేగవంతం చేయడంపై రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జి మంత్రుల కు సీఎం రేవంత్‌ పూర్తి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+