50 ఎకరాలకు తగ్గకుండా.. రేవంత్ ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలిసిన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కు ల రూపంలో సమర్పించే కోడెలను ఈ గోశాలలోనే సంరక్షిస్తుంటారు అధికారులు.

మూడు రోజుల్లో ఎనిమిది కోడలు మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గోశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోవులకు అందిస్తోన్న దాణా, ఇతర పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి ఆరా తీశారు.

CM Revanth Reddy decided to Cow protection thru modern Goshalas

కోడెల మరణం అటు రాజకీయరంగు కూడా పులముకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా గోశాలల నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలను ఇందులో సమీక్షించారు.

రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్ణీత గడువులోగా ఆయా కమిటీలు తమ పూర్తిస్థాయి నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణ కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రూపొందించాలని చెప్పారు. గోవుల సంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండటానికి వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని, మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోవులను బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చూడాలని అన్నారు. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పరిశీలించారు. అందులో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ఖరారు చేయాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+