అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని అభినందించిన సీఎం రేవంత్.. వీడియో వైరల్
హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జూన్ 14 సాయంత్రం గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డులను సినీ పరిశ్రమకు చెందిన కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ అవార్డుల ఫంక్షన్ లో కొన్ని మరపురాని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్ వేదికగా జరిగిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ఫంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గెస్టులను అందర్నీ పలకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్ లను చూసి హగ్ చేసుకుని అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇక పుష్ప-2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ విషయంలో అనేక ప్రచారాలు వచ్చాయి. ఈ హగ్ తో ఇప్పుడు ఇలాంటి కథనాలు, ప్రచారాలకు బ్రేక్ పడినట్లుగా భావించవచ్చు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
BhAAi Dialogue..🏆🤙🏻🤙🏻@alluarjun 👑#AlluArjun #AA22 #Pushpa2 pic.twitter.com/HhdKLBwHpc
— 𝖡𝖴𝖭𝖭𝖸 𝖲𝖱𝖨𝖪𝖠𝖭𝖳𝖧 AAA (@bunnysrikanthaa) June 14, 2025
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహిస్తున్న'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' వేడుక కన్నుల పండగగా సాగింది. హైటెక్స్ లో జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications